గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ (1999లో సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే ) అభ్యర్ధులుగా ఎంపిక అయ్యారు.నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని…ప్రభుత్వ ఉద్యోగులుగా 43వేల మంది ఆర్టీసీ సిబ్బంది అవుతారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సెషన్లోనే బిల్లు ప్రకటించారు. వరద తక్షణ సాయంగా రూ.500కోట్లు విడుదల చేస్తామని…జేబీఎస్ నుండి తూకుంట వరకు డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ నిర్మిస్తామని వెల్లడించారు. ఉప్పల్ నుండి బీబీ నగర్,షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు నుండి కందుకూరు వరకు మెట్రో పొడిగింపు ఉంటుందని తెలిపారు.
ఎల్బీ నగర్ నుండి పెద్ద అంబర్ పేట వరకు, ఉప్పల్ నుండి ఈసీఎల్ క్రాస్ రోడ్డు వరకు మెట్రో….మియాపూర్ నుండి లక్డీడ్ కపూల్ వరకు…రాయదుర్గం నుండి శంషాబాద్ వరకు… ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ ఉంటుందని వివరించారు. హకీంపేట ఎయిర్ పోర్టు ను పౌరసేవలకు వాడటానికి
కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం, మున్నేరు వాగు వెంట రిటైనింగ్ వాల్, వరదల వల్ల దెబ్బ తిన్న రోడ్లు వెంటనే తాత్కాలిక మరమత్తులు చేస్తామని వివరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రావణ్,కుర్రా సత్యనారాయణ అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యుత్ వీరులకు ఆగస్టు 15న సత్కారం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.