తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. వెయ్యి కోట్లు అప్పు చేయడానికి సిద్ధం అవుతుంది. రాష్ట్ర అవసరాల కోసం రూ. వెయ్యి కోట్లు అప్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ రూ. వెయ్యి కోట్ల అప్పు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కాగ ఈ నెల 29వ తేదీన రిజర్వ్ బ్యాంక్ వేయనున్న బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,029 కోట్ల అప్పును సమీకరించుకోనుంది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి రుణం కానుంది. కాగ 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో రూ. 47,500 కోట్ల రుణాలు చేయలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇటీవల కాగ్ కు ఇచ్చిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నెల వరకు రూ. 44,365 కోట్లు రుణంగా తీసుకుంది. అలాగే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత అప్పు తీసుకుంది. తాజా గా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ నుంచి రూ. 1,029 కోట్లు అప్పు చేయనుంది.