రవాణా శాఖలో అందరికీ ప్రమోషన్ లు ఇస్తాం : పొన్నం ప్రభాకర్

-

రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం అని తెలిపిన పొన్నం ప్రభాకర్.. రేపటి నుండి ఎలక్రిక్ వాహనాలు అన్ లిమిటెడ్ గా కొనుక్కోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్ లు ఉంటున్నాయి అని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు చొరవ తీసుకొని ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయాలి. ఈవి వాహనాలకు గతంలో 5 వేల వాహనాలకు టాక్స్ మినహాయింపు ఇచ్చారు ..అక్కడి వరకు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు లక్షా 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇప్పటి వరకు రోజుకు ప్రతి వంద వాహనాలలో 5 ఎలక్ట్రిక్ వాహనాల వస్తున్నాయి.

వచ్చే 10 రోజుల్లో రవాణా శాఖ జీహెచ్ఎంసీ hmda ,హైదరాబాద్ పోలీస్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తం. రవాణా శాఖ ప్రమోషన్లకు వ్యతిరేకం కాదు. అన్ని క్లియర్ చేస్తం. అందరికీ ప్రమోషన్ లు ఇస్తాం.. ప్రాసెస్ నడుస్తుంది అని తెలిపిన మంత్రి పొన్నం.. పొల్యూషన్ చెకప్ చేసే వాహనాలు సరిగా చేయడం లేదనే ఆటోమాటిక్ టెస్టింగ్ సెంటర్స్ తీసుకొస్తున్నం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version