తెలంగాణ స్టేట్ లో ఏర్పాటు అయినటు వంటి కొత్త ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరుల స్తూపం వద్ద స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్కడే ఎకరం స్థలం కేటాయించాలని అదిలాబాద్ కలెక్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కాగా, 1981లో తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న ఆదివాసీలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అందుకు చిహ్నంగా అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారు. కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. నేడు విద్యుత్, ఆర్టీసీ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.