అంగన్‌వాడీల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి : జగ్గారెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అంగన్ వాడీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం దాదాపు 16 రోజుల నుంచి  నిరసన చేపడుతున్నారు. ఇవాళ సదాశివపేటలో అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లను, ఆయాలను పర్మినెంట్ చేయాలని, వారి సమ్మెపై ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

గత 16 రోజుల నుంచి అంగన్‌వాడీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఏం చేసిన ఎన్నికల కోడ్ వచ్చే వరకే చేయాలని, ఎన్నికల కోడ్ వస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముఖ్యమంత్రి ఎవరున్న సరే అంగన్‌వాడీల డిమాండ్‌లు అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి అంగన్‌వాడీల సమస్యలను వినిపిస్తామన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెరవేరుస్తామని జగ్గారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version