మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుంది : ప్రధాని మోడీ

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇందూరు పర్యటించారు. 8,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపనలు చేశారు ప్రధాని. 800 ఎస్టీటీపీ జాతికి అంకితం చేశారు. మనోహరబాద్-సిద్దిపేట రైల్వే లైన్ ను విద్యుదీకరణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా  సిద్దిపేట-సికింద్రాబాద్  కొత్త రైలు సర్వీస్ లను ప్రారంభించారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణకు రెండోసారి వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. 

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం మాట్లాడారు. నా కుటుంబ సభ్యులారా అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది మా వర్క్ కల్చర్ అన్నారు. మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుంది. త్వరలో భారతీయ రైల్వే వ్యవస్థ వందశాతం ఎలక్ట్రిపికేషన్ పూర్తవుతుందన్నారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు మేము  కృషి చేస్తున్నాం అని పేర్కొన్నారు ప్రధాని మోడీ. బీబీ నగర్ లో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనాన్ని మీరు చూస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version