తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు.
అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు, జీహెచ్ఎంసీలో విలీనం కానున్న ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, జాబ్ క్యాలెండర్, హెచ్ఎండీఏ పరిధి విస్తరణ, రైతు భరోసారి విధి విధానాలు వంటి తదితర అంశాల ఆమోదంపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ పేరు మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్‌ను భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.