కేటీఆర్ E-ఫార్ములా రేసు పై విచారణకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ- కారు రేస్ అంశంలో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఆమోదం తెలిపారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ అక్టోబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.
దానికి బదులిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వానికి ఈ నెల 10న ఫైల్ పంపినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. కేటీఆర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చారా? లేదా? అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్స్ లో పెట్టింది. తాజాగా కేబినెట్ భేటీలో సీఎం వెల్లడించారు. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది.