హైదరాబాద్‌లో ఉన్న ఒక్క కాంగ్రెస్ పార్టీ లీడర్‌కు కూడా దమ్ము లేదు అని దీపాదాస్ మున్షీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో గాంధీభవన్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. తనకు కచ్చితంగా మంత్రి పదవీ ఇవ్వాల్సిందే అని పట్టు బట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కుమారుడు అనిల్ కు రాజ్యసభ ఇచ్చారు..? ఇంకేంటి అని ఓ వర్గం వాదించగా.. తనకు మంత్రి పదవీ ఇవ్వకూడదా..? ప్రశ్నించారు అంజన్ కుమార్ యాదవ్.
ఈ నేపథ్యంలోనే దీపాదాస్ మున్షీ మాట్లాడారు. కేటీఆర్, హరీష్ రావుకు కౌంటర్ ఇవ్వడం మీకు చేతకాదు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్‌గా ఉందని.. హైదరాబాద్‌లో పబ్లిక్ కూడా చాలా చీప్‌గా ఉన్నారు. రూ.100, 200 ఇస్తే చాలు.. మీటింగ్‌కు వచ్చేస్తరు అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ సంచలన వ్యాఖ్యలు చేశారు.