గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గాంధీ భవన్ లో వివాదం తలెత్తింది. ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తన మనసులోని మాటను బయట పెట్టారు. తనకు కచ్చితంగా మంత్రి పదవీ ఇవ్వాల్సిందే అని పట్టు బట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. కుమారుడు అనిల్ కు రాజ్యసభ ఇచ్చారు..? ఇంకేంటి అని ఓ వర్గం వాదించగా.. తనకు మంత్రి పదవీ ఇవ్వకూడదా..? ప్రశ్నించారు అంజన్ కుమార్ యాదవ్.
ఈ వివాదం ఎంతకు సద్దుమనగకపోవడంతో దీపాదాస్ మున్షీ అక్కడి నుంచి వెళ్లి పోయారు. మరోవైపు సీనియర్ నాయకులు హన్మంత రావు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు పాత బస్తీ కాంగ్రెస్ నాయకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయింది. కానీ మంత్రి వర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు. దీనిపై అనేక రాజకీయ కారణాలున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.