గ్రూప్ 2 పరీక్షలో కేసీఆర్, టీఆర్ఎస్ గురించి ప్రశ్నలు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారి గ్రూపు-2 పరీక్ష ఈనెల 15, 16 తేదీలలో జరిగిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షలను నిర్వహిస్తోంది కాబట్టి.. దాదాపు కాంగ్రెస్ కి సంబంధించిన పథకాలు, కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులవే ప్రశ్నలు అడుగుతారని అభ్యర్థులు భావించారు. కానీ అధికంగా ప్రశ్నలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, కేసీఆర్, కేటీఆర్ మీద ప్రశ్నలు అడగడంతో అభ్యర్థులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ముఖ్యంగా కేసీఆర్ గురించి ప్రశ్నను పరిశీలించినట్టయితే.. ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి. A. న్యూఢిల్లిలో 2005లో కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమునకై నిరవధిక నిరహార దీక్షను ప్రారంభించెను. B. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్, కె.చంద్రశేఖర్ రావు కు హామీని ఇవ్వడం జరిగింది” అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశాలను కాలనుక్రమంగా అమర్చుము.. A. ప్రజా గర్జన-ఖమ్మం. B. నాగర్ కర్నూల్ నగారా- నాగర్ కర్నూల్ C. ఓరుగల్లు గర్జన -జనగాం. D. కరీంనగర్ కదన భేరి-సిరిసిల్ల అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు వస్తాయని అస్సలు ఊహించలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అలాగే తెలంగాణ తల్లి పై కూడా ప్రశ్న రావడం.. పాతదా..? కొత్తదా..? తర్జన భర్జన పడ్డారు గ్రూపు-2 అభ్యర్థులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version