నేడు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

-

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర‌రాజ‌న్ నేడు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై న‌ల్ల‌మ‌ల్ల అట‌వీ ప్రాంతంలోని ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. న‌ల్లమ‌ల్ల అట‌వీ ప్రాంతంలో ఉన్న చెంచుగూడెం ల‌ను త‌మిళి సై సంద‌ర్శించ‌నున్నారు. ఆయా గ్రామాల్లో ప‌లు అభివృద్ధి ప‌నులకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై శంకుస్థాప‌న చేయ‌నున్నారు. నేడు మొద‌టగా.. అప్పాపూర్ కు గ‌వ‌ర్న‌ర్ తమిళి సై చేరుకుంటారు.

అప్పాపూర్ కు చుట్టు ప‌క్క‌ల ఉన్న 6 చెంచు గూడెం ల‌కు చెందిన గిరిజ‌నుల‌తో త‌మిళి సై స‌మావేశం కానున్నారు. ఆయా చెంచు గూడెంల‌లో ఉన్న పాఠ‌శాల‌ల‌ను, ఆరోగ్య ఉప కేంద్రాల‌ను, టైల‌రింగ్ శిక్షణా కేంద్రాల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప‌రిశీలిస్తారు. అనంత‌రం ఆయా చెంచు గూడెంల‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

అలాగే అప్పాపూర్, బౌరాపూర్ గ్రామ సర్పంచ్ ల‌కు బైక్ అంబులెన్స్ ల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై అంద‌జేస్తారు. అనంత‌రం అక్క‌డి నుంచి శ్రీ‌శైలం ఆల‌యానికి వెళ్ల‌నున్నారు. అక్క‌డ స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకుని.. తిరిగి హైద‌రాబాద్ కు ప్ర‌యాణం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version