తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కు ఊహించని పరిణామం ఎదురైందని సమాచారం అందుతోంది. గవర్నర్ తమిళిసై ట్విట్టర్ (X) అకౌంట్ @DrTamilisaiGuv హ్యాక్ అయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ భవన్ అధికారులు. దీంతో కేసు నమోదు చేసుకుని…దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.
అయితే.. గవర్నర్ తమిళిసై ట్విట్టర్ (X) అకౌంట్ హాక్ కావడంపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరికాసేపట్లోనే గవర్నర్ తమిళిసై ట్విట్టర్ (X) అకౌంట్ హాక్ కావడంపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. కాగా రెండు రోజుల కిందట కూడా.. మంత్రి దామోదర రాజనర్సింహా అకౌంట్ కూడా అకౌంట్ హాక్ అయింది.