షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీపై మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే ఏంటి ప్రయోజనం? అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 10 కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి.
వారి గురించి తక్కువ మాట్లాడితే మేలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు మంత్రి అమర్నాథ్. ఎవరు వెళ్లి అడిగినా ఆ పార్టీలో సీటు ఇస్తారు’ అని అన్నారు మంత్రి అమర్నాథ్.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల ని నియమించారు. ఏపీ మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హై కమాండ్ పెట్టింది. ఈ మేరకు కేసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఏపీపీఎస్సీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైయస్ఆర్టిపిసి షర్మిల కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేయగా, షర్మిల కి ఊహించినట్లు ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతల్ని అప్పగించారు.