గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024.. ప్రకటించిన రాజ్ భవన్

-

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను వెల్లడించింది. వివిద రంగాలలో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈనెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.

పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాలలో గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిబా పురస్కారాలు ఇవ్వనున్నట్టు గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీలలో ఈ అవార్డులు ఉంటాయన్నారు. అవార్డు కింద రూ.2లక్షలు, జ్ఞాపిక అందజేయనున్నారు. ఈ అవార్డుకు ఎంపికైన వారిని పరిశీలించినట్టయితే.. దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలంపిక్ విజేత జీవాంజి దీప్తి, ప్రొఫెసర్ పాండు రంగరావు, పి.బి.కృష్ణా భారతి సంయుక్తంగా, ధృవాంశ్ ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ లు ఎంపికయ్యారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news