Telangana Elections : వారికి డిసెంబర్ 1న కూడా సెలవు

-

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న విద్యాశాఖ సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీన సెలవు ప్రకటించింది. పాఠశాల మరియు విద్యాశాఖ, సాంకేతిక, ఉన్నత విద్యా శాఖల సిబ్బందికి డిసెంబర్ ఒకటవ తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలింగ్ సందర్భంగా వారు రేపు అంటే నవంబర్ 30వ తేదీన అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి ఉన్నందున హాలిడే ఇస్తున్నట్లు తెలిపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అటు ఇవాళ మరియు రేపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీ అంటే రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.

రేపు పోలింగ్ సందర్భంగా ఇవాళ మరియు రేపు ప్రభుత్వ స్కూల్లో సెలవులు ప్రకటించారు. హైదరాబాద్ నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి తదితర జిల్లాలలో ప్రవేట్ స్కూళ్ళ కు కూడా హాలిడేస్ ప్రకటించారు. మిగతా జిల్లాలలో పోలింగ్ కేంద్రాలు లేని, వాటిల్లో ని టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ లేకుంటే ఆ స్కూల్స్ పనిచేస్తాయని విద్యాశాఖ వర్గాలు ప్రకటించాయి. పోలింగ్ జరిగే 30వ తేదీన అన్ని విద్యాసంస్థలు కార్యాలయాలకు సెలవులు ఇవ్వాలని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version