Telangana : నాగన్న సర్వే విడుదల…ఆ పార్టీడే గ్రాండ్ విజయం !

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రేపు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ప్రచారం కూడా ముగిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడత కూడా నిన్నటితో ముగిసింది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే రిపోర్టు విడుదలైంది.

ఇప్పటికే చాలా సర్వేలు రిలీజ్ అయినప్పటికీ ఈ సర్వే మాత్రం చాలా భిన్నంగా ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీనే తెలంగాణలో విజయం సాధించబోతుందని నాగన్న survey సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాగన్న survey అనే సంస్థ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.

ఈ సర్వే ప్రకారం భారత రాష్ట్ర సమితి పార్టీకి 60 నుంచి 68 స్థానాలలో… కాంగ్రెస్ పార్టీ 33 నుంచి 40 స్థానాలలో గెలుపొందుతుందని సర్వే అంచనా వేసింది. ఇక బిజెపి పార్టీ 1-4, ఎంఐఎం పార్టీ 5-7 స్థానాలలో గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. అంటే ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న మాట.

నాగన్న survey

  • బీఆర్ఎస్: 60-68
    కాంగ్రెస్: 33 – 40
    బీజేపీ: 1 – 4
    ఎంఐఎం: 5 – 7

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version