రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కీలక సూచన

-

రాష్ట్రంలోని రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. రేషన్ కార్డుల్లో పేర్లు మార్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. “రేషన్ కార్డుల్లో మార్పులకు ప్రభుత్వం శనివారం నుంచి అవకాశం కల్పించింది. మీ సేవ కేంద్రాల్లో ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. రేషన్ కార్డులో పేరు లేనివారు, పిల్లల పేర్లు, కొత్తగా పెళ్లైన వారు తమ పేర్లను నమోదుకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు” అనే వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ ఇష్యూ పై స్పందించిన సివిల్ సప్లై శాఖ అధికారులు.. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారమంతా ఫేక్ అని.. దీనిని ప్రజలు ఎవరూ నమ్మొద్దని సూచించారు. రేషన్ కార్డుల్లో సవరణలు, పేర్లు నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ప్రక్రియ మొదలైందనే వాట్సాప్లలో ఫేక్ వార్తలు రావడంతో ప్రజలు రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news