తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..1523 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 1523 స్పెషల్ టీచర్ల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 18,857 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులు ఉండగా…. ప్రైమరీ స్కూళ్లలో 796 అలాగే హై స్కూల్ లలో 727 పోస్టులను మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 91 పోస్టులు అలాగే సిరిసిల్ల జిల్లాలో 20 పోస్టులు ఉన్నాయి. అంతేకాదు టీఆర్టీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఒక విద్యాశాఖ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 30000 వరకు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నారు. మీరంతా ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో 10900 మంది ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version