గ్రూపు2, 3 లలో అదనపు పోస్టులు.. కొత్తగా ఎన్ని అంటే..?

-

టీఎస్పీఎస్సీ లీకేజీ కారణంగా గత ప్రభుత్వ హయాంలో రిక్రూట్ మెంట్ నిలిచి పోయిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసింది. కొత్త చైర్మన్ ని కూడా నియమించింది. పారదర్శకంగా నియామకాలు చేపట్టే అంశాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకుంది. గ్రూప్ 2, 3లలో అదనపు పోస్టులను భర్తీ చేసేందుకు సప్లిమెంటరీ నోటిఫికేషన్లకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.

గ్రూపు 1 మాదిరిగానే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా అదనపు పోస్టులను కలపాలని సర్కారు కసరత్తు చేయనున్నట్టు సమాచారం. 2022గ్రూపు 2 నోటిఫికేషన్ లో 783 ఖాళీలను టీఎస్పీఎస్సీ గుర్తించింది. 18 విభాగాల్లో కలిపి 783 ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. అయితే వీటిని 2022 డిసెంబర్ 30న గ్రూపు 3 నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రస్తుతం గ్రూపు3లో 1375 ఖాళీలున్నాయి. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్లు ఇచ్చే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్టు సమాచారం. గ్రూపు 1 మాదిరిగానే గ్రూపు 2, 3 నోటీఫికేషన్లను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లను ఇవ్వనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news