గ్రూప్ 2 వాయిదా కోరుతూ.. TSPSC కార్యదర్శికి వినతి పత్రం అందజేసిన అభ్యర్థులు

-

గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. అభ్యర్థులంతా హైదరాబాద్ టీఎస్పీఎస్సీ ఆఫీసు వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 29, 30 తేదీలలో నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కమిషన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పరీక్షల లీకేజీతో ప్రిపరేషన్‌ గందరగోళంగా మారిందని.. అన్ని పరీక్షలు వెంటవెంటనే పెడితే ఎలా రాయగలుగుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతున్నామని.. గ్రూప్‌ 2 సిలబస్‌ కూడా మార్చారని.. ప్రిపేర్‌ అయ్యే సమయం లేదని ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులపై ప్రభుత్వానికి ఇంత కోపం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఆఫీసు ముందు అభ్యర్థులంతా బైఠాయించారు. మరోవైపు గ్రూప్ 2 వాయిదా వేయాలని టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, విద్యావేత్త డాక్టర్ రియాజ్ వినతిపత్రాలు అందజేశారు. ‘టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ లేరు.. కార్యదర్శిని కలిశాం. టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి 48 గంటల సమయం అడిగారు. ఏదో ఒక నిర్ణయం చెప్పేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు.’ అని అభ్యర్థులు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news