గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలి !

-

గ్రూప్2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు BJYM తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది అభ్యర్థులకు ఒకే నెలలో జేఎల్, గురుకుల తదితర పరీక్షలు ఉండటం, అన్ని పరీక్షలు నెలన్నర సమయంలో నిర్వహించడం వల్ల అభ్యర్థులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. అంతేగాక గ్రూప్ 2 కొత్త సిలబస్ ను చేర్చడంతో అభ్యర్థుల ప్రిపరేషన్ కు సమయం సరిపోదు.

గతంలో పేపర్ లీకేజీ కారణంగా రెండు, మూడు నెలలు అభ్యర్థులందరూ మానసిక ఒత్తిడికిలోనై చదువుకు దూరమయ్యారని వివరించారు. TSPSC బోర్డ్ నోటిఫికేషన్లు, పరీక్షల, నియమాలను తప్పుల తడక మార్చి ప్రతిసారి నిరుద్యోగుల, అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్2 పరీక్షను 3 నెలల సమయం ఇచ్చి తరువాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, వాయిదా నిర్ణయం ప్రకటించాలి. కోరారు. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు, నిరసనలతో పాటు సెక్రటేరియట్, ప్రగతిభవన్ ని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version