మెగాస్టారా మజాకా.. వరల్డ్ సినీ చరిత్రలోనే తొలిసారిగా.. GPSతో ‘భోళాశంకర్’

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ ప్రకటించిన నాటి నుంచే అభిమానులు, సినీ ప్రియులు సోషల్‌ మీడియా వేదికలో తెగ రచ్చ నడుస్తోంది. ఎక్కడ చూసిన చిరు సినిమా సందడే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్ర బృందం మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించరిస్తోంది.

ఇవాల హైదరాబాద్‌ వీధుల్లో 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ మొత్తంగా చూస్తే మెగాస్టార్‌ ముఖ చిత్రం కనిపించేలా ఈ ర్యాలీని చేపట్టడం విశేషం. ఇప్పటి వరకు సినీ పరిశ్రమలో ఏ హీరోకు ఇలా ఉత్సవాలు చేయలేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఇది సినిమా ప్రచారంలో భాగం మాత్రమే కాదని.. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని ఆయన గొప్పతనాన్ని ఇలా చాటుతున్నామని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. గురువారం ఉదయం చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version