గ్రూప్‌-4 పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల

-

తెలంగాణలో గ్రూప్- 4 ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. జులై 1న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లుగా జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలు, మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.  గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’పై ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.

పేపర్-1 పరీక్షకు సంబంధించి 7,63,835, పేపర్ -2 పరీక్షకు సంబంధించి 7,61,028 మంది అభ్యర్థులు హాజరైయ్యారని వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల కాపీలు సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.  జులై 1న జిల్లా అధికారుల నుంచి తీసుకున్న ఫోన్ ద్వారా తీసుకున్న ప్రాథమిక సమాచారం మేరకు పేపర్-1 పరీక్షకు 7,62,872 మంది, పేపర్ -2 పరీక్షకు 7,61,198 మంది హాజరైనట్లు సమాచారం అందిందని.. అయితే జిల్లాల నుంచి ఓఎంఆర్ పత్రాలను తీసుకుని ఇమేజింగ్ చేసిన తర్వాత హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కమిషన్ స్పష్టత ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news