ఈ నెల 30వ తేదీ రాఖీ పూర్ణిమను దేశం అంతటా ఎంతో సంతోషంగా జరుపుకోనున్నారు ప్రజలు. ముఖ్యంగా ఈ రాఖీ పూర్ణిమ రోజున ప్రతి అక్క మరియు చెల్లి తమకు ఉన్న అన్న లేదా తమ్ముడు కి రాఖీ కట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ పండుగను నార్త్ ఇండియా లో చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. కాగా ఈ పండుగను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు ఒక మంచి కానుకను ప్రకటించింది. రాఖీ పూర్ణిమ మొదలయ్యే క్షణం నుండి రెండు రోజుల వరకు మహిళలు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సులలో పూర్తి ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును కల్పించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాధ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్తను తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇక మహిళలు అయితే ఆగష్టు 30 మరియు 31 తేదీలు సిటీ బస్సులలో సంతోషంగా తిరగనున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రజలు అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు కూడా తెలియచేయడం విశేషం.