గ్రూప్ 4 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో పలితాలు..?

గ్రూపు 4 అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గ్రూపు 4 ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది TSPSC. . అక్టోబర్ మొదటి వారంలో ప్రకటన వెలువడే అవకాశముంది. ఫలితాలను ప్రకటించే ముందు టీఎస్పీఎస్సీ తుది కీ ని విడుదల చేస్తుంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ని కమిషన్ ఇప్పటికే విడుదల చేసింది. అలాగే ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 04 మధ్య అభ్యంతరాలను ఆహ్వానించింది.

ప్రాథమిక కీ కి సంబంధించిన అభ్యంతరాలు సమీక్ష కోసం నిపుణుల కమిటీకి పంపబడ్డాయి. వారి డిక్లరేషన్ తరువాత తుదీ కీ విడుదల చేయబడుతుంది. కీలక ప్రకటన అనంతరం గ్రూపు 4 ఫలితాలను కమీషన్ విడుదల చేస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. గ్రూపు 4 సర్వీస్ ల కోసం వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 ఖాలీల కోసం కమిషన్ ప్రకటన చేసింది. దాదాపు 9.51 లక్షల మంది రిక్రూట్ మెంట్ పై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ దరఖాస్తు నమోదు చేసుకున్నారు. అయితే టీఎస్పీఎస్సీ గ్రూపు4 పరీక్షకు నమోదైన వారిలో కేవలం 7,62,872 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రైమరీ కీకి సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించిన తరువాత పరీక్ష రాసేవారు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలయ్యే వరకు విద్యార్థులు తమ ఓఎంఆర్ షీట్లను కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో యాక్సెస్ చేసుకోవచ్చని.. సంబంధిత విభాగాలు తెలిపాయి.