మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన యువతి.. పాలు అమ్ముతూ నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తోంది.!!

పాలు అమ్మినోళ్లు.. ఈరోజు పాలించే స్థాయికి ఎదిగారు.. కేవలం పాల వ్యాపారంతో లక్షలు సంపాదిస్తున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. పల్లెటూర్లలో వ్యవసాయంతో పాటు.. అందరూ గేదలను పెంచుకుంటారు. ఇంట్లో పాలకు పోనీ మిగిలింది కేంద్రాలకు పంపుతుంటారు. కేవలం పాలవ్యాపారం చేసినా మంచి లాభం వస్తుంది. దీనికి సీజన్‌తో సంబంధంలేదు. ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పాల వ్యాపారం కేవలం చదువుకోని వాళ్లు మాత్రమే కాదు.. గొప్ప చదువులు చదివి.. మార్షల్‌ ఆర్ట్స్‌లో బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన యువతి.. ఇప్పుడు రోజుకు 150 లీటర్ల పాలు అమ్మూతూ.. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తుంది. ఈమె సక్సస్‌ఫుల్‌ స్టోరీ మనకూ తెలుసుకుందాం.

 

రాజస్థాన్‌లో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన కోటాకు చెందిన ఓ యువతి పశుపోషణ చేస్తూ… లక్షల రూపాయలు సంపాదిస్తోంది. కోటకు చెందిన మీటూ గుర్జార్ 12 ఏళ్ల నుంచి పశుపోషణ, పాడి పరిశ్రమ నిర్వహిస్తోంది. నేడు మీటూ తన జిల్లాలోని ప్రతి ఆడపిల్లకూ, మహిళలకూ ఆదర్శంగా నిలిచింది. పశుపోషణ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో సమానంగా సంపాదిస్తుంది.

శ్రమ, అభిరుచి కారణంగా ఈరోజు విజయవంతమైన బిజినెస్ ఉమెన్‌గా మీటూ రోల్ మోడల్‌గా మారింది. ఆమె అక్కకు 12 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగింది. ఆమెకు ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. మీటూ తండ్రి ఒంటరిగా పశుపోషణ, పాడి పరిశ్రమలు చేసేవారు. ఆమె కూడా తన తండ్రికి సహాయం చేస్తూ ఉండేది. క్రమంగా అన్ని వ్యాపారాలనూ నేర్చుకుంది, ఆమె స్వయంగా పశుపోషణ, పాడి పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆవులు, గేదెలను మేపడం, జంతువులకు ఎప్పటికప్పుడు మేత ఇవ్వడం, పాలు పితకడం ఇవన్నీ మీటూ ఒంటరిగా చేసేది. ఇప్పుడు అన్నయ్య పెద్దవాడైనప్పటికీ, తన చెల్లికి.. ఆవులు, గేదెల సంరక్షణ, పాలు పితికే రోజువారీ పనుల్లో సాయం చేస్తున్నారు. .

స్వయంగా మీటూ… బైక్‌పై తిరుగుతూ నగరంలో పాలు సరఫరా చేస్తోంది. ఆమెకు 4 గేదెలు, 15 ఆవులు ఉన్నాయి. రోజూ 150 లీటర్ల పాలు అమ్ముతుంది. మీటూ ఆవు పాలను లీటర్ రూ.50కి, గేదె పాలను లీటరుకు రూ.60కి అమ్ముతోంది. ఆమెకు నెలకు రూ.1.5 నుంచి 2 లక్షలు ఖర్చవుతోంది. ఖర్చులు పోగా ఆమె నెలకు రూ.1 నుంచి 1.5 లక్షల వరకు సంపాదిస్తోంది. ఒక్కోసారి రూ.2 లక్షలు కూడా మిగులుతాయట. రిస్క్‌ లేకుండా టెన్షన్‌ లేకుండా చేసే వ్యాపారం. ఉన్న ఊర్లోనే ఉంటూ హ్యాపీగా లైఫ్‌ను లీడ్‌ చేయొచ్చు. మనం కష్టపడుకుండా.. నెలకు పదివేలు ఇచ్చి ఒకరిని పెట్టుకున్నా.. ఆ పనులన్నీ చేసేస్తారు. దర్జాగా సంపాదించేయొచ్చు కదా. !