గుడ్​న్యూస్.. ఆగస్టు నుంచి పట్టాలెక్కనున్న ‘గృహలక్ష్మి’

-

తెలంగాణలో సొంతస్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వారి కోసమే గృహలక్ష్మి పేరిట నూతన పథకం రూపొందించిన విషయం తెలిసిందే. ఈ పథకం ఆగస్టు నుంచి పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి స్థూల మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.

ఏటా 4 లక్షల మందిని ఎంపికచేసి సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎంపికైన లబ్ధిదారులకు 3 దశల్లో ఆయా మొత్తాలను విడుదల చేసేందుకు నిర్ణయించింది.

ఆగస్టు చివరివారం నుంచి లబ్ధిదారుల దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ముసాయిదా విధానాలను సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news