తెలంగాణ రైతులకు బిగ్ న్యూస్..రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు అవుతారు. 09-12-2023 తేదీ నాటికి బకాయి వున్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి వుంటుంది. తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2.00 లక్షల (రూపాయలు రెండు లక్షలు) వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది.