తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈనెల 26 నుంచి రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కొత్త రేషన్ కార్డుల మంజూరుకు మార్గదర్శకాల విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు పరిశీలించేందుకు ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.
ముఖ్యంగా ఇటీవల చేపట్టిన కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను తయారు చేసింది ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యత అప్పగించింది. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్త ప్రక్రియకు బాధ్యత వహించనున్నారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శించి చర్చించిన తరువాత ఆమోదం తెలుపనున్నారు. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపులకు అవకాశం కల్పించనున్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ఈనెల 26 నుంచి కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనుంది పౌరసరఫరాల శాఖ.