తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు జగన్.
మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఓ ప్రతీక అన్నారు. భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని.. ఇంకా సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని కోరారు వైఎస్ జగన్.