దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

-

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి సాయిబాబాకు పూజలు చేస్తున్నారు.

మహారాష్ట్రలోని షిరిడీ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి షిరిడీ చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు గురుపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వరంగల్‌.. ఇలా వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో  వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి.

భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని  విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, కర్నూలు బాలాజీనగర్‌, నెల్లూరు, విజయనగరం, అనంతపురంలోని ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని సాయినాథుడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news