తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో ఇవాళ్టి నుంచి ఈనెల 14వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల ప్రారంభంలో భాగంగా గురువారం సాయంత్రం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు.
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు దాదాపు 2 లక్షల మంది దీక్షాపరులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే కొండగట్టు పరిసరాల్లో 55 తాత్కాలిక, 64 శాశ్వత మరుగుదొడ్లను సిద్ధం చేసినట్లు ఈవో వెంకటేశ్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఏఈ లక్ష్మణ్‌రావు తెలిపారు.
1500 నాయీబ్రాహ్మణులు, కొండగట్టు దిగువ, పైన ఏడు ప్రాంతాల్లో భక్తుల వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని సిద్ధం చేసినట్లు వివరించారు. శుద్ధజలం అందించేందుకు 5 సంచార ఆటోలు, 28 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, కొత్తకోనేరులో ఎప్పటికప్పుడు నీళ్లను నింపడంతోపాటు 120 షవర్లు ఏర్పాటు చేశామన్నారు. వర్షం కురిసినా.. ఎండ కొట్టినా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.