విశాఖ పర్యటనలో మరోసారి సీఎం జగన్ తన ఔదార్యం చాటుకున్నారు. కాన్సర్ ఆసుపత్రి ప్రారంభించి సీ హారియర్ ప్రారంభోత్సవానికి వెళుతూ దారిలో గమనించి కాన్వాయ్ ఆపి అనారోగ్య బాధితుడిని పరామర్శించారు సీఎం జగన్. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న వానపల్లి చరణ్ సాయి మణికంఠకు మెరుగైన వైద్యం అందిస్తామని సీఎం జగన్ భరోసా కల్పించారు.
విశాఖ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రికి ఆరిలోవ రోడ్డులో ముఖ్యమంత్రి సహాయం నిమిత్తం తల్లి వానపల్లి పార్వతి, (ఆరిలోవ, విశాఖపట్నం రూరల్ మండలం) తన కుమారుడు వానపల్లి చరణ్ సాయి మణికంఠకు హార్ట్ పేషెంటని, సికెల్ సెల్ వ్యాధికి గురయ్యాడని ముఖ్యమంత్రికి వివరించగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్ స్పందించి ఆర్థిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించి, భవిష్యత్తులో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం నుండి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో లక్ష రూపాయల చెక్కును ఆరిలోవలో వారి ఇంటికి వెళ్లి జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ అందజేశారు.