రేపే మూసీ, మల్లన్న సాగర్‌ బాధితుల దగ్గరకు పోదాం..నా కారులోనే కూర్చో – హరీష్‌ సవాల్‌

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. మూసి బాధితుల దగ్గరకు, మల్లన్న సాగర్ కు పోదాం… రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. గన్మెన్ లు లేకుండా పోదాం అని సీఎం అన్నారు…. నేను కారు నడుపుకుంటూ వస్తాను… నా పక్కన కూర్చో.. ఇద్దరం కలిసి వెళ్దామని సవాల్‌ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు షాకింగ్‌ కామెంట్స్ చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్బుత విన్యాసం చూసామని… ఇచ్చిన హామీలు దృష్టి మరల్చే విధంగా చేస్తున్నారని ఆగ్రహించారు.

Harish Rao fire on hydra demolitions

హైదరాబాద్ కు మూడు దిక్కులా సముద్రం ఉంది అని సీఎం అంటున్నారని.. హైదరాబాద్ లో మాత్రమే నగరం మధ్యలో నుంచి నది వెళుతోంది అన్నారని చురకలు అంటించారు. చాలా నగరాల మధ్యలో నది వెళ్తుందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్షం గా ఉండి ఒక్క సీటు గెలవలేదు అన్నారని… కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం గా ఒక్క సీటు కూడా గెలవలేదని సెటైర్లు పేల్చారు. సీఎం ప్రెస్ మీట్ లో చాలా అబద్ధాలు మాట్లాడారన్నారు. గ్రాఫిక్ హంగులతో సిఎం రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ను నిన్న ప్రెస్ మీట్ లో చూపించారని ఆగ్రహించారు. మూసీ సుందరీకరణ కు brs వ్యతిరేకం కాదని తెలి పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version