సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే : మంత్రి సీతక్క

-

సారం లేని భూమి, విద్య లేని జీవితం ఒక్కటే అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ‘హైసా’ ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ విద్య సదస్సుకు మంత్రి సీతక్క హాజరై మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు ఇక్కడ సమావేశం అయిన వారందరికీ అభినందనలు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని చెప్పారు.

సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయని.. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయంటూ వివరించే ప్రయత్నం చేశారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో విద్య అందుతున్న విధానాన్ని ఆమె ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని వివరించే ప్రయత్నం చేశారు. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందితే, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని చెప్పారు. అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలని సీతక్క పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version