కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉంది అంటూ హరీష్ రావు కామెంట్స్..!

-

స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉందంటూ హరీష్ రావు కామెంట్స్ చేసారు. ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేశామని, తమ ప్రభుత్వ ఘనత గా నియామక పత్రాల జారీ పేరు తో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యం అని అన్నారు హరీష్ రావు.

అలానే ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని, పత్రికల సాక్షిగా ప్రచారం చేసింది కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మార్చడానికి ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తుందని అన్నారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news