ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా.. మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని తెలంగాణ మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల  వ్యాఖ్యల్లో అహంకారం కనిపిస్తుంది.ప్రజలు ఛీ కొట్టినా ఇంకా బుద్ధి రాలేదు.కవిత పూలే విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.బీసీ లపై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను తొలగించి బీసీకి ఆ పదవీ ఇవ్వాలి అన్నారు.

ఏపీ ఎన్నికల ప్రచారం గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను.  నేను వైఎస్సార్ సిపి లో లేను కాబట్టి కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేస్తాను. ఏపీ లో ఎన్నికల షెడ్యూల్ రాగానే తప్పకుండా ప్రచారంకు వెళ్తాను అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. గతంలో వైఎస్ జగన్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు కొండా సురేఖ. తెలంగాణలో వైఎస్సార్ సీపీ అంతగా లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news