కేసీఆర్ కిట్లు తెస్తే.. రేవంత్ తిట్లతో పోటీ పడుతున్నారు : హరీశ్ రావు

-

పాలమూరు వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఖండించారు. మహబూబ్‌నగర్‌ వెనుక బాటుతనానికి కారణం కాంగ్రెస్సేనని విమర్శించారు. కాంగ్రెస్‌ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని అన్నారు. పాలమూరు వలసలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

మాజీ సీఎం కేసీఆర్ కిట్లు తెస్తే… సీఎం రేవంత్‌ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నారని హరీశ్ రావు అన్నారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదని పేర్కొన్నారు. ఓట్లు, సీట్లే కాదు నిజాయతీగా పని చేయాలని సూచించారు. పాలమూరు ప్రాజెక్టు 80% పూర్తయిందన్న హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. నాలుగు ప్రాజెక్టుల కింద 650000 ఎకరాలకు నీళ్లు అందించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news