హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీ రావు పాత్ర ఎంతో ఉంది – హరీష్ రావు

-

హైదరాబాద్ అభివృద్ధిలో రామోజీ రావు పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు. రామోజీరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు….మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైయ్యారు. రామోజీ రావు గారి మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు అన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు.

Harish Rao

తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారని గుర్తు చేశారు. ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీ రావు.. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారని వెల్లడించారు. తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసి కృషి ఎంతో గొప్పదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news