మేడిగడ్డకు వెళ్లి పచ్చటి పొలాలు, పారుతున్న వాగులు చూడండి – హరీష్ రావు

-

మేడిగడ్డకు వెళ్లి పచ్చటి పొలాలు, పారుతున్న వాగులు చూడండంటూ సీఎం రేవంత్‌ కు కౌంటర్‌ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ కాంగ్రెస్‌ ప్రభుత్వ మంత్రులు, సీఎం రేవంత్‌ మేడిగడ్డకు పయనం అయ్యారు. అయితే.. వారికి హరీష్‌ రావు కౌంట్‌ ఇచ్చారు. శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నానని…మీరు మాట్లాడి, మాకు మైకులు మాకు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అంటూ ఫైర్‌ అయ్యారు.

harish rao counter to revanth reddy

ప్రజాస్వామ్య విలువలు మంట గలిపే విధంగా ఉంది ప్రభుత్వం తీరు ఉందన్నారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని చురకలు అంటించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అంటూ తెలిపారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహించారు. మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండని కోరారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news