ఏపీ మంత్రులపై మరోసారి హరీష్ రావు ఫైర్

-

ఏపీ మంత్రులపై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు మాట్లాడుతూ.. మీకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం పోరాడండి అని చురకలంటించారు. తాను ఏపీ ప్రజలను తిట్టలేదని.. అయినా కొంతమంది నాయకులు తనపై ఎగిరెగిరి పడుతున్నారని వంటిపడ్డారు. తాను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడానని తెలిపారు హరీష్ రావు.

ఉన్నది ఉన్నట్టు అంటే ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. ఏపీ మంత్రులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మా కాలేశ్వరం లాగా నీళ్లు తెచ్చి మాట్లాడండి అని అన్నారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలని హితవు పలికారు. మా తెలంగాణ ఎంత గొప్పగా ఉందో పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పాలన్నారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version