సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో లేఖ..నిద్ర పోనిచ్చేలా లేడుగా !

-

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరిన హరీష్ రావు…25 శాతం మాత్రమే కేంద్రం కొంటుందని మిగతా 75 శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు (sun flower) పంట పండించారన్నారు.

Former Minister Harish Rao has written a letter to CM Revanth Reddy

ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని నేను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశానని వివరించారు. దానికి స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారని ఆగ్రహించారు. మొత్తం పంటలో కేవలం 25 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 75 శాతం పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version