రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేసిన తరుణంలో.. హరీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాటిచ్చి రుణమాఫీ అమలు చేయక పోవడం పట్ల హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పిన రేవంత్ తీరును బట్టబయలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది.
రుణమాఫీ మాట తప్పిన నేపథ్యంలో రేవంత్ ఒట్లు వేసిన దేవుళ్ళ వద్దకు వెళ్లి ప్రార్థన చేయనున్నారట హరీష్ రావు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇక దీనిపై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… రుణమాఫీ చారాణా కోడికి బారాణా మసాలా ఉంది… చేసినదానికి మూడింతల ప్రచారం చేస్తున్నారన్నారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అని మోసం చేశారు..దేవుళ్ళ పై ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పారని ఆగ్రహించారు. ఇంత నీచమైన సీఎం దేశంలో ఎక్కడా లేరని తెలిపారు. ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో రైతులు ఆలోచించాలన్నారు. తెలంగాణలో 36లక్షల మంది రైతులుండగా ఇంకా 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని విమర్శలు చేశారు.