ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాకారం : హరీశ్ రావు

-

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో స్వరాష్ట్ర కల సాకారం చేసుకున్నామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్​ బోర్డు సర్కిల్​ వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి హరీశ్​ రావు కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్ధిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో మోడరన్ దోబీ ఘాట్​లను రజకుల సౌకర్యార్థం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version