జమ్మూ కాశ్మీర్ లో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాలు అనుబంధాన్ని తెంచుకున్న గులాబ్ నబీ ఆజాద్ నేతృత్వంలో పార్టీ ప్రారంభం అయింది. సోమవారం మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించారు గులాం నబి ఆజాద్. ” డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ” గా నామకరణం చేశారు.
ఈ సందర్భంగా గులాం నబి ఆజాద్ మాట్లాడుతూ.. ” నా కొత్త పార్టీ కోసం దాదాపు 1500 మంది పేర్లను ఉర్దూ, సంస్కృతంలో నాకు పంపారు. అయితే పార్టీకి పెట్టే పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా ఉండాలని మేము కోరుకున్నాం. అందుకే డెమొక్రటిక్ ఆజాద్ అనే పేరు పెట్టాం” అన్నారు గులాం నబీ ఆజాద్. వచ్చే ఎన్నికలలో కాశ్మీర్ లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.