6 గ్యారంటీలు కాదు… కాంగ్రెస్ వస్తే….6 నెలలకో సీఎం మారతాడు – హరీష్ రావు

-

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు వాగ్దానాలు…. కచ్చితంగా ఆరుగురు ముఖ్యమంత్రి మాత్రం మారతారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చురకలం అంటించారు. రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ స్కీములను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీముల కు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీంలు అసాధ్యమని… కానీ కాంగ్రెస్ పాలనలో ఆరుగురు ముఖ్యమంత్రిలు మారడం కచ్చితం అని ఎద్దేవా చేశారు. అలాగే… ప్రతి విషయానికి ఢిల్లీకి వెళ్లాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గంటలు మాత్రమే కరెంటు ఉంటుందని… ఉదయం పూట మూడు గంటలు అర్ధరాత్రి మూడు గంటలు కరెంటు ఇస్తారని వెల్లడించారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీకి బెంగళూరు రెండవ రాజధాని అయిందని… ఏది కావాలన్నా ఢిల్లీ వయా బెంగళూరు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ పై సెటైర్లు పేల్చారు మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news