పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని కీలక వ్యాఖ్యలు..!

-

పార్లమెంట్ భవనం, సెంట్రల్ హాల్ లో ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక్కడే చట్టాలు చేసి ముస్లిం మహిళలకు ఇచ్చాం. భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంట్ సెంట్రల్ భవనంలో ఇదే చివరి సమావేశం. లోక్ సభ, రాజ్యసభ కలిసి ఇక్కడ 4వేల చట్టాలు చేశాయని గుర్తు చేశారు ప్రధాని.

ఇక్కడే భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఇక్కడే చట్టాలు చేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశాం.370 ఆర్టికల్ ను రద్దు చేశామని తెలిపారు. ఈ హాల్ లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో భావోద్వేగాలు. 86 సార్లు దేశాధ్యక్షులు ఇక్కడి నుంచి ప్రసంగం చేశారు. 41 దేశాల అధినేతలు ఇక్కడి నుంచి ప్రసంగించారని గుర్తు చేశారు ప్రధాని మోడీ. ఇవాళ జమ్మూ కాశ్మీర్ ప్రశాంతత చూస్తున్నాం. ఇక్కడే జాతీయ గీతం, జాతీయ పతాకం ఎంచుకున్నామని పేర్కొన్నారు. సరికొత్త లక్ష్యాలను సాధించేందుకు ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news