అభివృద్ధిలో దుబ్బాక ఐదేళ్లు వెనక్కి పోయింది : హరీశ్ రావు

-

దుబ్బాక ఉపఎన్నికలో అబద్దాలతో బీజేపీ గెలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. దుబ్బాక ప్రజలకు రఘునందన్‌రావు చేసింది ఏం లేదని చెప్పారు. అభివృద్ధిలో దుబ్బాక ఐదేళ్లు వెనక్కి పోయిందని అన్నారు. సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం హరీశ్ రావు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.

“కేసీఆర్‌ సీఎం మూడోసారి కాబోతున్నారు. కేసీఆర్ మళ్లీ వస్తే రూ.2 వేల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలు చేసింది ఎవరు? మూడోసారి గెలిపిస్తే రైతు బంధు రూ.16 వేలు ఇస్తాం. సన్నబియ్యాన్ని రేషన్‌షాప్‌లో ఇస్తాం. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తాం. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా.. చెప్పని పనులు కూడా ఎన్నో చేశారు. అలాగే కేసీఆర్​ను మళ్లీ గెలిపిస్తే.. రాష్ట్రం మరెంతో అభివృద్ధి చెందుతుంది” అని హరీశ్ రావు అన్నారు.

నామినేషన్ వేసే ముందు హరీశ్ రావు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సిద్దిపేటకు చేరుకుని అక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం చర్చి, మసీదుల్లో ప్రార్థనలు చేసి నామినేషన్ కేంద్రానికి వెళ్లి అధికారికి నామపత్రాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news