కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే అపన్న హస్తమా? భస్మాసుర హస్తమా? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి, బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి ఎద్దేవా చేశారు హరీష్ రావు.
తెలంగాణ భవన్ కాదు..ఇకపై ప్రజా భవన్ అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సమస్యల వచ్చినా… తెలంగాణ భవన్ కు రావాలని హైడ్రా, మూసి బాధితులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలోనే ఉంది..దాన్ని కూల్చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు…కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని బాంబ్ పేల్చారు. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉందన్నారు. అతని తమ్ముడి ఇల్లు FTL లో ఉంది. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.